Share News

మా భూములకు హక్కులు కల్పించండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:19 AM

వందల సంవ త్సరాలుగా సాగులో ఉన్న తమ భూములకు శాశ్వతంగా రికార్డు పరమైన హక్కులు కల్పించాలని చీపురుపల్లిలోని జి.అగ్రహారానికి చెందిన ఇనాం రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొర పెట్టుకోనున్నారు.

మా భూములకు హక్కులు కల్పించండి

చీపురుపల్లి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): వందల సంవ త్సరాలుగా సాగులో ఉన్న తమ భూములకు శాశ్వతంగా రికార్డు పరమైన హక్కులు కల్పించాలని చీపురుపల్లిలోని జి.అగ్రహారానికి చెందిన ఇనాం రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొర పెట్టుకోనున్నారు. ఈ మేరకు వారంతా జి.అగ్రహారంలోని సచివాలయం వద్ద శుక్రవా రం సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు. జి.అగ్రహారం పరిధిలోని 1190 ఎకరాల భూమి తాతల కాలం నుంచి తమ సాగులో ఉందని తెలిపారు. 375 మంది రైతులు ఈ భూముల్ని సాగు చేసుకుంటున్నామన్నారు. సుమారు 5వేల కుటుంబాలు ఈ భూములపై ఆధార పడి జీవిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ భూములు ఇనాం పరిధిలో ఉన్నందును తమకు ఎటువంటి శాశ్వత భూ హక్కులు దాఖలు పడలేదన్నారు. 1బీలు జారీ కావడం లేదని, దీని కార ణంగా క్రయవిక్రయాలు జరపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చె ప్పారు. టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునా యుడు, పార్టీ నాయకుడు పతివాడ శ్రీను మాట్లాడు తూ ఈ సమస్యను గతంలో ఎమ్మెల్యే కళా వెంకటరా వుకు వివరించామని, శనివారం రావివలస రానున్న ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 12:19 AM