సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వండి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:11 AM
ఈనెల 23 నుంచి జరిగే జామి యల్లారమ్మ జాతరలో సామన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
జామి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఈనెల 23 నుంచి జరిగే జామి యల్లారమ్మ జాతరలో సామన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. బుధవారం జామి మండల పరిషత్ కార్యాలయంలో ఎల్లారమ్మ జాతర సమీక్షను ఈవో ప్రసాద్, సేవా కమిటీ అధ్యక్షుడు అల్లాడ పెద్ద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూర రద్దీని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ, తాగునీటి శాఖ, పోలీసు, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ శాఖ కోతలు లేకుండా చూడాలని.. తాటిపూడి జలాలు ద్వారా మూడురోజుల పాటు తాగునీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖ ఎటువంటి పాసులు ముద్రించవద్దని...ఈ బాధ్యత తహసీల్దార్ చూసుకుంటారని వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కృష్ణంరాజు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి, మండల టీడీపీ అధ్యక్షుడు వర్రి రమణ, ఎంపీడీవో నీలంనాయుడు, డీటీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.