Share News

సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వండి

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:24 AM

ఎస్‌.కోట పుణ్యగిరి మహాశివరాత్రి జాతరలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని దేవదాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సూచించారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వండి

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

  • పుణ్యగిరిలో శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష

శృంగవరపుకోట, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఎస్‌.కోట పుణ్యగిరి మహాశివరాత్రి జాతరలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని దేవదాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సూచించారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధి కారులతో సమావేశమయ్యారు. ఈ జాతరకు దాదాపు లక్షకు పైబడి భక్తులు వస్తున్నందున ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, దివ్య దర్శనం వంటి టిక్కెట్లను పెట్టవ ద్దన్నారు. ఒకే రకమైన క్యూలైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. వీవీఐపీ, వీఐపీలు వచ్చినప్పుడు తహసీ ల్దార్‌ డి.శ్రీనివాసరావు సూచనల మేరకు వ్యవహరించా లన్నారు. శాఖల వారీగా ఏర్పాట్లను అడిగి తెలుసుకు న్నారు. సుమారు 200 మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. వాహనాల రాకపోకల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ధారగంగమ్మ లోయ జలపా తం వద్ద స్నానాలు చేసే మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికంగా ప్రత్యేక గదులు నిర్మాణం చేసే బాధ్యత దేవదాయ శాఖ తీసుకో వాలన్నారు. పుణ్యగిరి కొండ దిగు వ భాగం, ఉమాకోటి లింగే శ్వర స్వామి ఆలయం వద్ద, ధర్మవరం సన్యాసేశ్వర స్వామి ఆలయం వద్ద మూడు చోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని కొట్టాం పీహెచ్‌సీ వైద్యాధికారిణి హారిక వివరించారు.

ప్రత్యేక బస్సులు నడపండి

రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులకు ఎమ్మెల్యే లలితకుమారి సూచించారు. పుణ్యగిరికి 14 బస్సులు, ధర్మవరం సన్యాసేశ్వర స్వామి ఆలయానికి రెండు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ డీఎం సుదర్శనరావు తెలిపారు. పుణ్యగిరి రోడ్డు ఇరుకు తో పాటు అక్కడక్కడ గుంతలు ఉండడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. రోడ్డును బాగు చేయించడంతో పాటు మహాశివరాత్రి (ఆదివా రం) రోజు ఉదయం నుంచి మరుసటి రోజు సోమవా రం సాయంత్రం వరకు ఈ రోడ్డులో ఆటోలు తిరగకుం డా చూడాలని కోరారు. వీధి దీపాలు, పారిశుధ్యం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పంచా యతీ ఈవో చంద్రశేఖర్‌ చేప్పారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు జీ.ఎస్‌ నాయుడు, పుణ్యగిరి ఉత్సవ కమిటీ చైర్మన్‌ పెదగాడ అప్పలరాజు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ జగదీష్‌ పాల్గొన్నారు. అనంతరం పుణ్యగిరి మహాశివరాత్రి మహోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Updated Date - Feb 07 , 2026 | 12:24 AM