Share News

‘మా భూములు తిరిగి ఇచ్చేయండి’

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:21 AM

విజయనగరం వీటి అగ్రహారంలో మేంగో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ కోసం 2004లో ఇచ్చిన రైతుల భూములను తిరిగి ఇవ్వా లని సీపీఎం నాయకుడు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు.

‘మా భూములు తిరిగి ఇచ్చేయండి’

విజయనగరం దాసన్న పేట, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): విజయనగరం వీటి అగ్రహారంలో మేంగో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ కోసం 2004లో ఇచ్చిన రైతుల భూములను తిరిగి ఇవ్వా లని సీపీఎం నాయకుడు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం వీటి అగ్రహారంలో భూములిచ్చిన రైతులతో ఆయన సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో ఇండస్ట్రీ పెడతామని 20 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకున్నారని, భూములిచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పి, భూములు తీసుకున్నారన్నారు. నేటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.. రైతులకు ఉద్యోగం ఇవ్వలేదు .. తక్షణమే రైతులకు తిరిగి భూములు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రైతులు పైడినాయుడు, శంకరరావు, ఆదిలక్ష్మి, గురునాయుడు, రమణ, లక్ష్మణరా వు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:21 AM