చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:51 PM
తాటి చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మి కుడు వనుము పాపయ్య(42) మృతిచెందిన ఘటన మండలంలోని బొడ్డవలస మధుర గ్రామం వెల్లంపేటలో మంగళవారం చోటుచేసుకుంది.
డెంకాడ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తాటి చెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మి కుడు వనుము పాపయ్య(42) మృతిచెందిన ఘటన మండలంలోని బొడ్డవలస మధుర గ్రామం వెల్లంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉద యం కల్లు తీసే పని నిమిత్తం పాపయ్య తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న సమయంలో అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. నడవలేని పరిస్థితిలో ఉన్న పాపయ్యను గ్రామానికి చెందిన మహిళ చూసి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు వచ్చి, గ్రామ స్థుల సాయంతో ఆటోపై ఆయన్ని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికికి తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పాప య్య మృతిచెందాడు. మృతుడి తల్లి తవుడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ మురళీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.