Share News

Giripradaksina on the new road ఇక కొత్త రహదారిపై గిరిప్రదక్షిణ

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:43 PM

Giripradaksina on the new road ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం పరిధిలో చేపట్టే గిరి ప్రదక్షిణకు పక్కా రహదారి సిద్ధమైంది. ఈ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు

Giripradaksina on the new road ఇక కొత్త రహదారిపై గిరిప్రదక్షిణ
సిద్ధమైన రహదారి

ఇక కొత్త రహదారిపై గిరిప్రదక్షిణ

సిద్ధమైన రోడ్డు

నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

నెల్లిమర్ల, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం పరిధిలో చేపట్టే గిరి ప్రదక్షిణకు పక్కా రహదారి సిద్ధమైంది. ఈ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రతీ సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు రామతీర్థం కొండచుట్టూ గిరిప్రదక్షిణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం కొత్త తారురోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఈ రోడ్డును ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ బుధవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రత్యేక శ్రద్ధతో ఈ రోడ్డును పూర్తి చేయించారు. ప్రారంభోత్సవ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:43 PM