Share News

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:12 AM

స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున పిలుపునిచ్చారు.

  స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి

  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

విజయనగరం రూరల్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్‌ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుందని తెలిపారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీ, జిల్లా స్థాయిలో కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు శతశాతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్‌, ఆకిరి ప్రసాద్‌రావు, రాజేష్‌వర్మ, కనకల మురళీమోహన్‌, అప్పలరామిరెడ్డి, మడక తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పరిశీలన

విజయనగరం నగర శివారులో నిర్మాణం జరుగుతున్న టీడీపీ కార్యాలయ భవనాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున శనివారం పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం అనంతరం ఆయన కార్యవర్గ సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లారు. కాంట్రాక్టు సంస్థకు చెందిన ప్రతినిధితో మాట్లాడారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 50 శాతం త్వరలో పూర్తి చేయనున్నట్టు ప్రతినిధి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు ప్రసాదుల ప్రసాద్‌, ఆకిరి ప్రసాద్‌రావు, కోండ్రు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:12 AM