ఎన్నికలకు సమాయత్తం కండి
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:12 AM
స్థానికసంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని విజయ నగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు.
విజయనగరం రూరల్, సెప్టెంబరు 16 ( ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని విజయ నగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. బుఽధవారం విజయనగరంలోని టీడీపీకార్యాలయంలో పార్టీ నాయకు లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాలంలో విజయన గరం నియోజకవర్గంలో 544 కోట్ల రూపాయలతో అభి వృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా రవి, పీతల కోదండరామ్, గంటా పోలినాయుడు, పాసి అప్పలనాయుడుతో పాటు క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
నిరుద్యోగ అభ్యర్థులకు మేలు
నగరంలోని గురజాడ అప్పారావు రోడ్డులో వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, విజయనగరం నియోజ కవర్గ టీడీపీ పరిశీలకుడు పీవీజీ కుమార్‌లు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన జాబ్ క్యాలెండర్, గతంలో జరిగిన మెగా డీఎస్సీ గురించి వివరించారు. మంత్రి నారాలోకేష్ త్వరలో మరో డీఎస్సీ ఉంటుందని ప్రకటిం చారని, నిరుద్యోగ అభ్యర్థులకు పభుత్వం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.