Share News

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:58 PM

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే విజయచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి
నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర

- ఎమ్మెల్యే విజయచంద్ర

- పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం

పార్వతీపురం రూరల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): స్థాని క ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే విజయచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం వెంకంపేట పరిధిలో ఉన్న టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచం ద్ర మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలి పారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా మని, కూటమి ప్రభుత్వంలో దీర్గకాలిక సమస్యలను పరి ష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణాలతో పాటు ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. మరికొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకు లు, కార్యకర్తలు కృషి చేస్తూ ప్రభుత్వం చేస్తున్న అభివృ ద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిం చాలన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భక్తి భావంతో మెలగాలి

బెలగాం, ఏప్రిల్‌ 25 (ఆంధ్ర జ్యోతి): ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని, ఆధ్యాత్మి కతకతో ముందుకు సాగితే మానసిక ప్రశాంతత లభి స్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. శనివారం బెలగాం కోవెల వీధిల కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 11:58 PM