Share News

Local Body Elections స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:21 AM

Get Ready for Local Body Elections స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి పోలీస్‌ అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం పోలీస్‌ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

 Local Body Elections స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
నేర సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి పోలీస్‌ అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం పోలీస్‌ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైపర్‌ సెన్సిటివ్‌ గ్రామాలు, సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించాలని తెలిపారు. జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ప్రజా కార్యక్రమాల్లో విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా బాడీవోర్న్‌ కెమెరాలను కచ్చితంగా వినియోగించాలని సూచించారు. పోలింగ్‌ సమయంలో ఎటువంటి అవాంఛీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించరాదన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో, హింసాత్మక ప్రాంతాల్లో డ్రోన్‌ పోలీసింగ్‌ చేయాలని ఆదేశించారు. ప్రజలకు హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలపై విస్త్రత ప్రచారం చేయాలన్నారు. సారా నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్‌ గవర్నెస్‌ సేవలు అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రజలకు కనబడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంబంధిత కేసుల దర్యాప్తును త్వరతగతిన పూర్తి చేయాలని వెల్లడించారు. నేరాల దర్యాప్తులో సాంకేతికతను జోడించి త్వరగా కేసులను పరిష్కరించాలని సూచించారు. డిజిటల్‌ పోలీసింగ్‌ వ్యవస్థను అమలు చేయడం కష్టతరంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో నేరాల దర్యాప్తునకు అది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు శేషయ్య, రాంబాబు, థామస్‌రెడ్డి, ఎస్బీ సీఐ రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:21 AM