Share News

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:30 AM

లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ఆర్డీవో రామ్మోహనరావు అన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
మాట్లాడుతున్న ఆర్డీవో రామ్మోహనరావు

బొబ్బిలి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ఆర్డీవో రామ్మోహనరావు అన్నారు. శనివారం బొబ్బిలి డివిజన్‌ పరిధిలో లింగ నిర్ధారిత పరీక్షల నిరోధ చట్టం అమలు తీరుపై వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పురుష సంతాన ప్రాధాన్యం, ఆడపిల్లలపై వివక్ష, మూఢనమ్మకాలు తదితర వాటి నేపథ్యంలో గర్భస్థ శిశువు ఆడ అని తేలితే గర్భ స్రావాలు చేయించుకోవడం నేరమన్నారు. 0-6 సంవత్సరాల బాలికల లింగ నిష్పత్తిని పెంచ డానికి ప్రభుత్వం లింగ నిర్ధారిత పరీక్షల నిరోధ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోందన్నారు. ఈ చట్టం ద్వారా లింగ నిర్ధారిత ఆడ శిశువుల భ్రూణ హత్యలను నిరోధించేందుకు ఈ చట్టం అత్యధిక ప్రాధాన్యమి స్తోందన్నారు. చట్టం అమలును ప్రతీ ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారిత పరీక్షల కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ సంతోషికుమారి, చిన్నపిల్లల వైద్యనిఫుణురాలు డాక్టర్‌ సంధ్య, సీఐ కింతలి నారాయణరావు, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ సుబ్బలక్ష్మి, ఎన్‌జీవో శాంతి, చిన్నతల్లి, హెచ్‌ఈ చాముండేశ్వరి పవన్‌ ఆశిష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 12:30 AM