విద్యుదాఘాతంతో గీత కార్మికుడి మృతి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:06 AM
రాజీపేట గ్రామా నికి చెందిన రాడీ రాము(60) అనే గీత కార్మికుడు గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
ఎస్.కోట రూరల్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాజీపేట గ్రామా నికి చెందిన రాడీ రాము(60) అనే గీత కార్మికుడు గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. రాము ఇటీవల తన కుమా ర్తె, కుమారుడికి పెళ్లిళ్లు చేశాడు. ప్రస్తుతం తన భార్య బుచ్చె మ్మతో కలిసి జీవిస్తున్నాడు. తమ గ్రామ సమీపంలోని పెదఖం డేపల్లి రైతు తన పొలంలో ఉన్న కొబ్బరిచెట్లకు కొబ్బరి కాయలు దింపాలని రామును కోరాడు. దీంతో రాము గురువారం ఉద యం పెదఖండేపల్లి వెళ్లాడు. కొబ్బరి చెట్టు ఎక్కుతుండగా, ఆ చెట్టును ఆనుకుని ఉన్న 11 కేవీ విద్యుత్ వైరు ఇతని వీపు వెనుక పెట్టుకున్న కత్తికి తగిలింది. దీం తో షాక్‌కు గురై, వెంటనే కిందకు పడిపోయాడు. అక్కడే ఉన్న తన భార్య బిగ్గర గా కేకలు వేయడంతో చుట్టుపక్కవారు వెంటనే చేరుకున్నారు. అప్పటికే రాము మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.