Share News

గేట్‌మన్లను కొనసాగించాలి

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:54 PM

రైల్వేశాఖ ఉన్నతాధికారులు స్పందిం చి గేట్‌మన్లగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మాజీ సైనికోద్యోగులు కోరారు. ఈ మేరకు రైల్వేట్రాఫిక్‌ గేట్లు వద్ద మాజీ సైనికోద్యోగులను గేట్‌మె న్లగా నియమించిన వారిని అర్థాంతరంగా తొలగించడంతో బుధవారం మండ లంలోని గరుడుబిల్లి రైల్వేస్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు.

గేట్‌మన్లను కొనసాగించాలి
గరుడబిల్లి రైల్వేస్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న మాజీ సైనికులు :

బొండపల్లి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రైల్వేశాఖ ఉన్నతాధికారులు స్పందిం చి గేట్‌మన్లగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మాజీ సైనికోద్యోగులు కోరారు. ఈ మేరకు రైల్వేట్రాఫిక్‌ గేట్లు వద్ద మాజీ సైనికోద్యోగులను గేట్‌మె న్లగా నియమించిన వారిని అర్థాంతరంగా తొలగించడంతో బుధవారం మండ లంలోని గరుడుబిల్లి రైల్వేస్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ సంవత్సరం తొమ్మిది నెలల కిందట కాంట్రాక్టు పద్ధతిలో సైన్యంలో పని చేసి పదవీవిరమణ చేసిన వారికి 40 మందికి గేట్‌మెన్లగా ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈనెల ఒకటోతేదీన అర్ధాంతరంగా ఎటువంటి ముంద స్తు ఉత్తర్వులు ఇవ్వకుండానే విధులనుంచి తొలగిస్తున్నట్లు చెప్పి 40మంది ఉద్యో గులను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. దీంతో తామంతా వీధినపడ్డా మని వాపోయారు. ఎందుకు తొలగిస్తున్నారో కనీసం ముందుగా సమాచారం ఇవ్వకుండానే మాజీ సైనికులు పట్ల రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం దారుణ మని పేర్కొన్నారు. కార్యక్రమంలో తొలగించిన 40 మంది గేట్‌మెన్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:54 PM