గ్యాస్ అందుబాటులోకి తేవాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:15 AM
ww
విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):తక్షణమే గ్యాస్‌ని అందు బాటులోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. బుధవారం రామకృష్ణానగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ కొరత వల్ల చిరు వ్యాపా రులు జీవనోపాధిని కోల్పోతున్నారని తెలిపారు. చిరు వ్యాపారులు బళ్లపై టిఫిన్స్, న్యూడిల్స్ అమ్ముకుని జీవనం సాగించేవారని, గ్యాస్ లేక వ్యాపారం వదిలేసి రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితగ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎంనాయకులు శాంతమూర్తి, జగదాంబ పాల్గొన్నారు.