వాణిజ్య గ్యాస్ కోసం అగచాట్లు
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:30 AM
మండలంలోని ఆరికతోట, రామభద్రపురం, భూసాయివలస, పారాపురం, కొట్టక్కి, రొంపల్లి తదితర గ్రామాల్లో వాణిజ్య గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు అగచాట్లకు గురవుతున్నారు.
రామభద్రపురం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆరికతోట, రామభద్రపురం, భూసాయివలస, పారాపురం, కొట్టక్కి, రొంపల్లి తదితర గ్రామాల్లో వాణిజ్య గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు అగచాట్లకు గురవుతున్నారు. పశ్చిమాసి యాలో యుద్ధం నేపథ్యంలో నౌకల ద్వారా ఓడరేవులకు చేరాల్సిన గ్యాస్ నిలిచిపోయింది. దీంతో కంపెనీలు సకాలంలో గ్యాస్ సిలిండర్లను అందించలేక పోతున్నాయి. దీంతో వంట గ్యాస్ వినియోగదారులతోపాటు హోటళ్లు, హాస్టళ్లు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. దీంతో కట్టెల పొయ్యిలు, పిడకలతో హోటళ్ల నిర్వాహకులు వంటలు చేయా ల్సివస్తోంది. గ్యాస్ సిలిండర్లు బుక్‌చేసిన సకాలంలో కంపెనీలు అందించలేకపోవడంతో కట్టెల రేట్లు కూడా విపరీతంగా పెంచేయడంతో హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్‌చేసి పది పదిహేను రోజులైనా విడుదల కాకపోవడంతో ఏజెన్సీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.