గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:08 AM
గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గంట స్తంభం వద్ద నిరసన చేపట్టారు.
సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
విజయ నగరం దాస న్నపేట, జూన్ 8 (ఆంధ్రజ్యో తి): గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గంట స్తంభం వద్ద నిరసన చేపట్టారు. ఈసందర్భంగా సీపీఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ రెండు నెలల్లో రెండు దఫాలుగా గ్యాస్ ధరలు పెంచిన మోదీ నిరంకుశ విధానాలకు నిరసన తెలుపుతున్నామన్నారు. సీపీఐ నేతలు రంగరాజు, అప్పలరాజు, వాసు, సూరీడమ్మ మహిళలు పాల్గొన్నారు.