చెత్త తొలగించక.. కాలువలు శుభ్రం చేయక
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:00 AM
మక్కువలో పారిశుధ్య నిర్వ హణ గాడితప్పింది. ప్రధానంగా రోజుల తరబడి రోడ్లపై చెత్త తొలగించ కపోవడంతోపాటు, కాలువలు శుభ్రంచేయకపోవడంతో గ్రామస్థులు అగ చాట్లకు గురవుతున్నారు. గ్రామంలో ప్రతివీధిలోనూ చెత్తకుప్పలుగా పేరు కుపోయాయి.
మక్కువ రూరల్, జనవరి 4(ఆంధ్రజ్యోతి):మక్కువలో పారిశుధ్య నిర్వ హణ గాడితప్పింది. ప్రధానంగా రోజుల తరబడి రోడ్లపై చెత్త తొలగించ కపోవడంతోపాటు, కాలువలు శుభ్రంచేయకపోవడంతో గ్రామస్థులు అగ చాట్లకు గురవుతున్నారు. గ్రామంలో ప్రతివీధిలోనూ చెత్తకుప్పలుగా పేరు కుపోయాయి. కాలువలుశుభ్రచేయకపోవడంతో చెత్త,మురుగు నీటితో నిండిపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాలువల్లో చెత్తను ప్రతిరోజూ తొలగించి క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లి వీధులను శుభ్రపరి చేందుకు చర్యలు తీసుకోవల్సిన పంచాయతీ అధికా రులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పెంట్రెడ్డి వీధి నుంచి కూరాకలవీధి,నాయీబ్రాహ్మణ,జన్ని, కర్నాలవీధిశివారుతోపాటు సువ ర్ణముఖి నది ఒడ్డున చెత్తకుప్పలు పేరుకుపోయాయి. అధికారులు ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే పేరుతో బ్యానర్లు పట్టుకొని ర్యాలీలు నిర్వహించి, ఫొటోలు తీసుకోవడం తప్పగ్రామాన్ని పరిశు భ్రంగా ఉంచడంలేదని పలు వురు ఆరోపిస్తున్నారు.గ్రామంలోని పలువీధుల్లోగల గ్రామశివార్లలో పేరుకు పోయిన చెత్తను వెంటనే తొలగించి శుభ్రం చేయాలని పలువురు కోరుతు న్నారు. కాగా రెండు రోజుల్లో చెత్తను తొలగించి, కాలువలను శుభ్రపరు స్తామని గ్రామపంచాయతీ కార్యదర్శి బి.శ్రీనివాసరావు తెలిపారు.