Share News

చెత్తకు నిప్పు.. ఏదీ కనువిప్పు?

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:07 AM

బహిరంగంగా వ్యర్థాలు కాల్చవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు.

  చెత్తకు నిప్పు.. ఏదీ కనువిప్పు?
అరసాడలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది(ఫైల్‌)

-గ్రామాలు, రహదారులపై వ్యర్థాలను కాల్చేస్తున్న వైనం

-పొగతో పర్యావరణానికి ముప్పు

వంగర ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): బహిరంగంగా వ్యర్థాలు కాల్చవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు. ఇళ్ల పరిసరాలు, రహదారుల వెంబడి నిత్యం చెత్తను కాల్చివేస్తున్నారు. దీంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. మండలంలోని కొండవలస- అరసాడ ప్రధాన రహదారిలో ప్రతిరోజూ టన్నుల కొద్ది చెత్త పేరుకు పోతుంది. ఇంటింటా చెత్తసేకరణ బాగానే జరుగుతున్నా దాదాపు అన్ని గ్రామాల్లో ఆ చెత్తను బహిరంగంగా చెరువుల్లో పడేస్తున్నారు. ఈ వ్యర్థా లను కాల్చేస్తుండడంతో పొగ వెదజల్లుతుంది. దీంతో స్థానికులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పొగను పీల్చి వృద్ధులు, చిన్నారులు శ్వాసకోస వ్యాధుల వ్యాధుల బారినపడుతున్నారు. చెత్తను కాల్చవద్దని అధికారులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. వంగర, మగ్గూరు, రాజు లగుమ్మడ రహదారులకు ఇరువైపులా ఉంటున్న వ్యర్థాలకు నిత్యం ఎవరో ఒకరు చెత్త పెడుతుండడంతో పొగ దట్టంగా కమ్మేస్తుంది. ఇప్పటికైనా అధి కారులు స్పందించి కాలనీలు, ప్రధాన రహదారులపై ఉన్న చెత్తను శుభ్రం చేసి డంపింగ్‌ యార్డులకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఈవోపీఆర్డీ రామారావును వివరణ కోరగా.. ‘గ్రామాల్లో సేకరిం చిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించాలని పారిశుధ్య సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ఇంటికి వచ్చిన బండికి తడి పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాం. కొన్నిచోట్ల సమీప చెరువుల్లో పడేస్తున్నారు. వెంటనే తనిఖీలు నిర్వహించి చెత్తను డంపింగ్‌ కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 20 , 2026 | 12:07 AM