Share News

కొత్తవలసకు పరిష్కారం కాని చెత్త తరలింపు సమస్య

ABN , Publish Date - May 12 , 2026 | 12:25 AM

కొత్తవలస మేజర్‌ పంచాయతీకి సంబంధించిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడం లేదు.

కొత్తవలసకు పరిష్కారం కాని చెత్త తరలింపు సమస్య

  • తాత్కాలికంగా శ్మశానవాటిక వద్ద చెత్త డంపింగ్‌

కొత్తవలస, మే 11 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస మేజర్‌ పంచాయతీకి సంబంధించిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న రాజన్న కాలనీకి చెందిన డంపింగ్‌యార్డులో చెత్తను కాలనీవాసులు వేయనీయకపోవడంతో పంచాయతీకి సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియక తాత్కాలికంగా కొత్తవలస-విజయనగరం రోడ్డులోని కొత్తవలస జంక్షన్‌ సమీపంలో ఉన్న శ్మశానవాటిలో చెత్తను వేస్తున్నారు. ఇక్కడ తాత్కలికంగానే చెత్త వేస్తున్నామని, ఇక్కడ నుంచి విశాఖ జిల్లా మధురవాడ ప్రాంతంలోనున్న మారికవలస ఎస్‌డబ్ల్యూపీసీకి తరలిస్తామని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ తెలిపారు. కొత్తవలస ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నా.. చాలా భూములు ఆక్రమణదారుల చేతుల్లోను, మరికొన్ని భూములు నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో రెవెన్యూ శాఖ సరైన స్థలాన్ని కేటయించలేకపోతోంది. కొత్తవలస 202 కాలనీ సమీపంలో డంపింగ్‌యార్డుకు స్థలం కేటాయించినా ఆ స్థలంలోకి చెత్త వాహనాలను తీసుకెళ్లడానికి సరైన రహదారి లేకపోవడంతో అక్కడకు తీసుకెళ్లి ఇబ్బందులు పడడం కంటే కొత్తవలస శ్మశానవాటిలో వేయడమే మేలని వేస్తున్నారు. రెవెన్యూ శాఖ పంచాయతీ పరిధిలోని చీపురువలస గ్రామ రెవెన్యూలో మరో ప్రాంతాన్ని గుర్తించిందని, ఆ ప్రాంతం అనువుగా ఉంటే రెండు మూడు రోజులలో అక్కడకు తరలించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - May 12 , 2026 | 12:25 AM