Share News

Gambling secretly గుట్టుగా జూదం

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:42 AM

Gambling secretly జిల్లాలో పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు తనిఖీలు తగ్గడంతో పేకాటరాయుళ్లు ఎక్కడికక్కడే తిష్ఠ వేస్తున్నారు. డబ్బులు గుమ్మరించి ఆటాడుతున్నారు. అప్పులు చేసి సై అంటున్నారు. చివరికి డబ్బులు పోగొట్టుకుని కుటుంబ సభ్యులపై తిరగబడడం.. ఆపై గొడవలకు దిగడం ఇటీవల కాలంలో పెరిగింది. కొన్ని కేసులే బయటపడుతున్నాయి.

Gambling secretly గుట్టుగా జూదం

గుట్టుగా జూదం

ఎక్కడికక్కడే పేకాట శిబిరాలు

నెమ్మదించిన పోలీస్‌ తనిఖీలు

చిత్తు అవుతున్న కుటుంబాలు

జిల్లాలో పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసు తనిఖీలు తగ్గడంతో పేకాటరాయుళ్లు ఎక్కడికక్కడే తిష్ఠ వేస్తున్నారు. డబ్బులు గుమ్మరించి ఆటాడుతున్నారు. అప్పులు చేసి సై అంటున్నారు. చివరికి డబ్బులు పోగొట్టుకుని కుటుంబ సభ్యులపై తిరగబడడం.. ఆపై గొడవలకు దిగడం ఇటీవల కాలంలో పెరిగింది. కొన్ని కేసులే బయటపడుతున్నాయి.

విజయనగరం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

పేకాటబారిన పడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వ్యసనంగా మారి చాలామంది బానిసలవుతున్నారు. చివరకు ఆర్థిక ఇబ్బందులబారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న వారూ ఉన్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలకు సమీపంలోని తోటల్లో పేకాట శిబిరాలు విస్తృతంగా సాగుతున్నాయి. పోలీసులు నామమాత్రపు తనిఖీలకే పరిమితమవుతు న్నారన్న విమర్శలున్నాయి. కాగా విజయనగరంలో పదుల సంఖ్యలో లాడ్జీలు ఉన్నాయి. అయితే అవి పేరుకే లాడ్జీలు వాటిల్లో పేకాట శిబిరాలు కూడా నడుస్తున్నాయి. బొబ్బిలి, రాజాం పట్టణాల్లో సైతం జూద శిబిరాలు నడుపుతున్నారు. నాగావళి, చంపావతి నదుల సమీపంలోని తోటలూ స్థావరాలే. అయితే ఈ పేకాట శిబిరాలకు అనధికార వ్యక్తులకు ప్రవేశం ఉండదు. తెలిసివారు, పరిచయస్థులు ఉంటేనే ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడ సభ్యత్వం కావాలంటే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ కట్టాల్సి ఉంటుంది. అక్కడే భోజనం, మద్యం, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ఇలా పేకాట శిబిరాలు నడుపుతున్నవారు లక్షలు ఆర్జిస్తున్నారు. ఆడుతున్న వారు ఆస్తులు కోల్పోతున్నారు. చివరకు అదే శిబిరాల్లో ప్రామిసరీ నోట్‌లపై సంతకాలు చేయించి అప్పులు ఇస్తున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో వివాదాలు తలెత్తుతున్నాయి.

మొన్న సంక్రాంతి సందర్భంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పేకాట శిబిరాలు విస్తృతంగా నడిచాయి. విజయనగరం, రాజాం, బొబ్బిలి పట్టణాల్లో కొందరు నిర్వాహకులుగా అవతారమెత్తి పండుగ సందర్భంగా పేకాట శిబిరాలు కొనసాగించినట్టు విమర్శలున్నాయి. సంక్రాంతి నాలుగు రోజుల్లోనే జిల్లాలో రూ.100 కోట్ల వరకూ పేకాట శిబిరాల ద్వారా చేతులు మారినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో విజయనగరం నడిబొడ్డున ఓ నేత జూద శిబిరం నడిపారు. పోలీసులు సీరియస్‌గా దృష్టిపెడితే చాలామంది పట్టుబడే అవకాశముంది.

ఫ జిల్లాలో ఫామ్‌ హౌస్‌ కల్చర్‌ నడుస్తోంది. స్థోమతపరులు ఎక్కువగా ఫామ్‌ హౌస్‌లు ఏర్పాటుచేస్తున్నారు. వీకెండ్‌లో అక్కడ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక లాడ్జిల్లో సైతం ఎక్కువగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

మూడేళ్లలో పేకాట కేసులు ఇలా

================

సంవత్సరం కేసులు ఎంత మంది స్వాధీనం చేసుకున్న నగదు

2024 360 కేసులు 1, 986 రూ. 87,48, 865

2025 191 కేసులు 1,101 రూ. 31,86, 322

2026 54 కేసులు 344 రూ. 14, 60,836

==================

Updated Date - Apr 20 , 2026 | 12:42 AM