Share News

పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:42 AM

సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి
ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జయకృష్ణ, తదితరులు

  • అక్కడికి వెళ్లేందుకు రోడ్లు నిర్మిస్తాం

  • కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

సీతంపేట, జూలై 30(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దోనుబాయి జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన మన్యం సవారీ బైక్‌ర్యాలీని గురువారం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. సీతంపేట నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తు దోనుబాయి సమీపంలో ఉన్న సున్నపుగెడ్డ జలపాతం వరకు ఈ బైక్‌ర్యాలీ సాగింది. ప్రకృతి సోయగాలకు నిలయమైన సున్నపుగెడ్డ జలపాతం వద్ద టెంట్‌హౌస్‌లో కూర్చుని కట్టెలపొయ్యిపై చేసిన వంటకాలను కలెక్టర్‌, ఎమ్మెల్యే రుచి చూశారు. జిల్లాలో ఎన్నో జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నాయని, అక్కడికి వెళ్లే రహదారులను త్వరలోనే అభివృద్థి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కాంక్రీట్‌ జంగిల్‌ దాటి అడవుల్లో కనీసం 3గంటలు గడిపితే శరీరానికి లభించే ఆక్సిజన్‌

సహజ వ్యవసాయంతో మంచి ఆదాయం: కలెక్టర్‌

సీతంపేట, జూలై 30(ఆంధ్రజ్యోతి): సహ జ వ్యవసాయంతో మంచి ఆదాయం వస్తుందని, మంచి ఆరోగ్యం కూడా సమ కూరుతుందని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన బూర్జగూడ గ్రామాన్ని సందర్శిం చారు. జీవ స్టార్స్‌ను పరిశీలించారు. కూరగాయలు, మామిడి మొక్కలు, నాటుకోళ్ల పెంపకం, జీవామృతం గురించి గిరిజన రైతులు కలెక్టర్‌కు వివరించారు. 30 గ్రామాల్లో 580మంది రైతులతో జీవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డ్‌ డీడీఎం దినేష్‌రెడ్డి వివరించారు. ఎమ్మెల్యే జయక్రిష్ణ, ఆర్ట్స్‌ సంస్థ డైరెక్టర్‌ నూక సన్యాసిరావు, మన్యం సహజ ఉత్పత్తుల కంపెనీ సీఈవో బి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:42 AM