Share News

రోడ్లకోసం నిఽధులు మంజూరు చేయాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:19 AM

బొబ్బిలి పట్టణ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కోరారు

  రోడ్లకోసం నిఽధులు మంజూరు చేయాలి
సీఎం చంద్రబాబుకు వైల్డ్‌ లైఫ్‌ ఫొటోల క్యాలెండర్‌ను అందజేస్తున్న బేబీనాయన :

బొబ్బిలి ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) బొబ్బిలి పట్టణ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కోరారు. ఈ మేరకు అమ రావతిలో చంద్రబాబును మంగళవారం బేబీనాయన కలిశారు. బొబ్బిలిలోని దాడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఏటా మే, జూన్‌లో జరగనున్న దృష్ట్యా పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ఊరేగింపు నేపథ్యం లో రోడ్ల అభివృద్ధికి రూ.రెండు కోట్లు మం జూరుచేయాలని కోరారు. పూల్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి దాడితల్లిఆలయం వరకుగల రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారని, నిధులు మంజూరు కోసం హామీ ఇచ్చారని బేబీనాయన తెలిపారు. తొలుత జాతీయ వన్యమృగసంరక్షణా కేంద్రాల్లో తీసిన వైల్డ్‌లైఫ్‌ ఫొటోలతో కూడిన క్యాలెండర్‌ను సీఎంకు అందజేశారు.

Updated Date - Feb 25 , 2026 | 12:19 AM