Share News

కోర్టు భవనాలకు నిధులు మంజూరుచేయాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:50 PM

శిథిలావస్థలో ఉన్న కొత్తవలస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవనాల కూల్చి వేతకు అనుమతిఇవ్వడంతోపాటు నూతన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరుచేయాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు.

కోర్టు భవనాలకు నిధులు మంజూరుచేయాలి
న్యాయశాఖ కార్యదర్శికి వినతిపత్రం ఇస్తున్న లలితకుమారి :

కొత్తవలస, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : శిథిలావస్థలో ఉన్న కొత్తవలస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవనాల కూల్చి వేతకు అనుమతిఇవ్వడంతోపాటు నూతన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరుచేయాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు.ఈమేరకు రాష్ట్రప్రభుత్వ న్యాయశాఖకార్యదర్శి జి.ప్రతిభాదేవికి బుధవారం వెలగపూడిలోని సచివాలయంలోని ఆమె కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సరైన కోర్టు భవనం లేకపోవడంతో ఇబ్బందులుపడుతుండడంతో ప్రతిపాదనలను పరిశీలించి నూతనంగా సింగిల్‌ కోర్టు భవనం నిర్మాణానికి అవసరమైన అనుమతులను మంజూరుచేయాలని కోరినట్లు తెలిపారు.

Updated Date - Feb 18 , 2026 | 11:50 PM