Share News

నిధులు మంజూరు చేయించాలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:11 AM

జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్వోదయ నిధులు మంజూరు చేయించాలని సాధన సమితి సభ్యులు ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిని కోరారు.

నిధులు మంజూరు చేయించాలి
వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

గుమ్మలక్ష్మీపురం, జనవరి20 (ఆంధ్రజ్యోతి): జంఝావతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్వోదయ నిధులు మంజూరు చేయించాలని సాధన సమితి సభ్యులు ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరిని కోరారు. మంగళవారం సాధన సమితి సభ్యులు క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారు నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సాధన సమితి చైర్మన్‌ చొక్కా భాస్కర రావు, కన్వీనర్‌ మరిచర్ల కృష్ణమూర్తి నాయుడు, సభ్యులు పారినాయుడు, మేడిశెట్టి రామచంద్రరావు, రౌతు వాసుదేవరావు, అంబటి రాంబాబు, వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అక్కేన మధుసూదనరావు ఉన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 12:11 AM