Share News

Funds for Hospitals ఆసుపత్రులకు నిధులు

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:52 PM

Funds for Hospitals పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో రిపేర్లకు రూ. 38 లక్షలు, చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరమ్మతు పనులకు రూ. 28 లక్షలు మంజూరైనట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎన్‌.భారతి తెలిపారు.

Funds for Hospitals  ఆసుపత్రులకు నిధులు
చినమేరంగి సీహెచ్‌సీలో పనులను పరిశీలిస్తున్న ఈఈ భారతి, తదితరులు

  • ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ భారతి

జియ్యమ్మవలస, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో రిపేర్లకు రూ. 38 లక్షలు, చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరమ్మతు పనులకు రూ. 28 లక్షలు మంజూరైనట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎన్‌.భారతి తెలిపారు. శనివారం చినమేరంగి ఆసుపత్రిలో జరుగుతున్న రిపేరు పనులను పరిశీలించారు. నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ స్టేండర్స్‌ (ఎన్‌క్వాస్‌) గ్యాప్‌లో భాగంగా నిధులు మంజూరైనట్లు ఆమె చెప్పారు. పార్వతీపురం ఆసుపత్రిలో మరమ్మతు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. చినమేరంగి సీహెచ్‌సీ వర్కులు ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని తెలిపారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీఈఈ బి.ప్రసన్నకుమార్‌, ఆసుపత్రి వైద్యాధికారి చంద్రవర్మ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.రాజారత్నంనాయుడు ఉన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:52 PM