Thotapalli Temple తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి నిధులు
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:31 AM
Funds Allocated for the Development of Thotapalli Temple ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల అభివృద్ధికి దేవదాయశాఖ అధికారులు నిధులు మంజూరు చేశారు. ప్రాకార మండపంతో పాటు పలు నిర్మాణాలకు రూ. 80 లక్షలు మంజూరు చేస్తూ.. కాకినాడ దేవదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి.దుర్గేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈవో బి.శ్రీనివాస్, చైర్మన్ ఎం.పకీరునాయుడు తెలిపారు.
గరుగుబిల్లి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల అభివృద్ధికి దేవదాయశాఖ అధికారులు నిధులు మంజూరు చేశారు. ప్రాకార మండపంతో పాటు పలు నిర్మాణాలకు రూ. 80 లక్షలు మంజూరు చేస్తూ.. కాకినాడ దేవదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి.దుర్గేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈవో బి.శ్రీనివాస్, చైర్మన్ ఎం.పకీరునాయుడు తెలిపారు. ఆదివారం తోటపల్లిలో వారు మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు ఇ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు పిలుస్తామన్నారు. దేవదాయశాఖ ఇంజనీర్లు సూచనల మేరకు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. తోటపల్లి దేవస్థానం పూర్వ వైభవానికి ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు.