Share News

Funds Allocated రహదారుల మరమ్మతులకు నిధులు

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:36 PM

Funds Allocated for Road Repairs జిల్లాలో పలు ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.15.77 కోట్లు మంజూరు చేసింది. ఎండీఆర్‌, ఎస్‌హెచ్‌ ప్లాన్‌ల కింద ఈ నిధులను కేటాయించింది. కాగా త్వరితగతిన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

Funds Allocated    రహదారుల మరమ్మతులకు నిధులు
రూపురేఖలు మారనున్న పనుకువలస - బలిజిపేట రహదారి

  • త్వరిగతన పనులు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశం

పార్వతీపురం, మార్చి20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.15.77 కోట్లు మంజూరు చేసింది. ఎండీఆర్‌, ఎస్‌హెచ్‌ ప్లాన్‌ల కింద ఈ నిధులను కేటాయించింది. కాగా త్వరితగతిన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం నుంచి చిలకపాలెం, రామభద్రపురం మీదుగా రాయగడ రోడ్డు అభివృద్ధికి రూ.కోటి 50 లక్షలు, కురుపాం నియోజకవర్గంలో స్టేట్‌ హైవే మరమ్మతులకు రూ. 50 లక్షలు మంజూరు చేశారు. ఇక పాలకొండ నుంచి హడ్డుబంగి రోడ్డుకు రూ.64 లక్షలు, ఇదే నియోజకవర్గంలో అలికాం-బత్తిలి రోడ్డు కోసం రూ.17 లక్షలు, నడుకూరు నుంచి జేకే గుమ్మడ రహదారి అభివృద్ధి కోసం రూ.8 లక్షలు కేటాయించారు. ఇదే నియోజకవర్గంలో సీఎస్‌పీ నుంచి తలవరం రోడ్డుకు రూ.కోటి, ఏబీ రోడ్డు నుంచి మణిగ రహదారి మరమ్మతులకు రూ.40 లక్షలు మంజూరు చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో బైపాస్‌ రహదారి అభివృద్ధి కోసం రూ.కోటి , ఆ మండలంలో ఎంఆర్‌నగరం- సంగంవలస రహదారి మరమ్మతుల కోసం రూ.30 లక్షలు, పనుకువలస- బలిజిపేట రోడ్డు పనుల కోసం రూ.68 లక్షలు మంజూరు చేశారు. సాలూరు నియోజకవర్గంలో వీసీపీ రోడ్డు, సాలూరు- మక్కువ రహదారి అభివృద్ధి కోసం రూ.కోటి 50 లక్షలు కేటాయించారు. కేదారిపురం-కేసరి, ఎల్విన్‌పేట-రామన్నగూడెం, కురుపాం- పి.టి.మండ రహదారుల పనుల కోసం రూ.రెండు కోట్ల 80 లక్షలు, బీజేపురం-టీఎన్‌వలస మీదుగా సీఎస్‌పీ నుంచి లక్నాపురం రహదారి మరమ్మ తులకు రూ. కోటి 40 లక్షలు, పెదగుత్తిలి- ఆవిరి రహదారికి రూ.50 లక్షలు, సీమనాయుడువలస రోడ్డు కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఆర్‌కేబాయి- పెద్దగుత్తిలి రోడ్డు మరమ్మతుల కోసం రూ.60 లక్షలు , కురుపాం-తుడుము రోడ్డు అభివృద్ధికి రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మంజూరైన నిధులతో నిబంధనల ప్రకారం పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ శాఖ జిల్లా ఇంజనీరింగ్‌ అధికారి రాధాకృష్ణ తెలిపారు.

Updated Date - Mar 20 , 2026 | 11:36 PM