Multi-Speciality Hospitals మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి నిధులు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:25 PM
Funds Allocated for Construction of Multi-Speciality Hospitals జిల్లాలో సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.49.25 కోట్లకు పరిపాలన ఆమోదం లభించినట్లు ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిమ్మన్న తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు పూర్తయ్యేనా?’ కథనంపై ఆయన స్పందించారు.
పార్వతీపురం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.49.25 కోట్లకు పరిపాలన ఆమోదం లభించినట్లు ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిమ్మన్న తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు పూర్తయ్యేనా?’ కథనంపై ఆయన స్పందించారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంచనా విలువ కంటే 0.60 శాతం తక్కువకు ఎన్‌సీసీ లిమిటెడ్‌తో రూ.35.80 కోట్లకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆ కంపెనీకి ఆసుపత్రుల పనులను అప్పగించామని తెలిపారు. ఇప్పటివరకు చేసిన పనులకు గాను రూ.28.89 కోట్ల వరకు బిల్లులు చెల్లించామన్నారు. ప్రస్తుతం ఆసుపపత్రుల్లో మినీ విద్యుత్ సబ్‌స్టేషన్, సంప్, ఫోల్డ్ , సీసీ రోడ్లు నిర్మాణం, రంగులు, శానిటరీ, విద్యుత్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించామన్నారు.