Share News

పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:19 AM

ఎస్‌. కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు ఆరోపించారు.

పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు

  • ఎమ్మెల్సీ రఘురాజు

  • ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రి సందర్శన

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ఎస్‌. కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు ఆరోపించారు. ఆసుపత్రి నూతన భవనాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎంపీడీ వో కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పనులు పూర్తి కాకుండానే రిబ్బన్‌ కటింగ్‌ చేశారని విమర్శించారు. ఆసుపత్రి ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందిం చకపోవడపై మండిపడ్డారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో ఆసుపత్రికి రావాల్సిన రూ.79లక్షలు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

ఉద్యోగాల పేరిట దోపిడీ

జిందాల్‌ కంపెనీకి సంబంధించిన భూ వ్యవహారా ల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ రఘు రాజు అన్నారు. భూములను కోల్పోయిన వారికి ఉద్యో గాలు ఇస్తామని చెప్పిన యాజమాన్యం కొత్త తరహా మోసానికి పాల్పడిందన్నారు. భూములు లేని వారి నుంచి రూ.3.30 లక్షలు తీసుకుని బినామీ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌ విచారణ చే యాలని ఆయన కోరారు. ఎంపీపీ సండి సోమేశ్వర రావు, ఎస్‌.కోట మాజీ సర్పంచ్‌ గనివాడ సంతోషి కుమారి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:19 AM