Share News

Jana Sena Today నిన్నటి వరకు వైసీపీ.. నేడు జనసేన

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:21 AM

From YSRCP Yesterday to Jana Sena Today సాలూరు పురపాలక సంఘంలో రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీకి చెందిన వ్యక్తికి జనసేన చైర్‌పర్సన్‌ సీటు ఇవ్వడంపై కూటమిలో అసంతృప్తి చెలరేగింది. వైసీపీకి రాజీనామా చేయకుండానే గొర్లె విజయకుమారికి జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా టికెట్‌ కేటాయించడంపై టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటు న్నాయి.

  Jana Sena Today నిన్నటి వరకు వైసీపీ.. నేడు జనసేన
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

  • సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటన

  • కూటమిలో చెలరేగిన అసంతృప్తి

  • భగ్గుమంటున్న టీడీపీ, జనసేన శ్రేణులు

పార్వతీపురం/సాలూరు, అక్టోబరు 17(ఆంధ్ర‌జ్యోతి): సాలూరు పురపాలక సంఘంలో రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీకి చెందిన వ్యక్తికి జనసేన చైర్‌పర్సన్‌ సీటు ఇవ్వడంపై కూటమిలో అసంతృప్తి చెలరేగింది. వైసీపీకి రాజీనామా చేయకుండానే గొర్లె విజయకుమారికి జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా టికెట్‌ కేటాయించడంపై టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటు న్నాయి. ఇలా అయితే తాము సహకరించేది లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మూక మ్మడిగా రాజీనామాలు చేస్తామని మరోవైపు జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. జనసేన లేదా టీడీపీకి చెందిన వారికే టికెట్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

వైసీపీకి రాజీనామా చేయకుండానే..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గొర్లె విజయకుమారి సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. 2023 తరువాత ఆమె భర్తతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి వైసీపీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వైసీపీ అభ్యర్థిగా మరొకరికి టికెట్‌ కేటాయించారు. దీంతో గొర్లె విజయకుమారి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా.. జనసేన పార్టీ సభ్యత్వ పొందకుండా అనూహ్యంగా ఆమె జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా టికెట్‌ పొందడంపై జనసేన, టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏదేమైనా రేపటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగి యనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జనసేన తరఫున మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎవరు నామినేషన్‌ వేస్తారన్నది చర్చనీ యాంశంగా మారింది.

ఎలా సహకరించగలం: టీడీపీ నాయకులు

సాలూరు, అక్టోబరు 17(ఆంధ్ర‌జ్యోతి): ‘సాలూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడం సరి కాదు. అలాంటిది వైసీపీకి చెందిన వ్యక్తిని జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించడం చాలా దారుణం.’ అని టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు అన్నారు. శనివారం మంత్రి సంధ్యారాణి క్యాంపు కార్యాలయంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు డబ్బి కృష్ణ, పప్పల మోహన్‌ తదితరులు స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. జనసేన పార్టీలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ లేకపోతే టీడీపీకి చెందిన ఆశావహులకు అవకాశం ఇవ్వాలన్నారు. జనసేన అధిష్ఠానం ఎవరిని కోరితే వారు జనసేన పార్టీ కండువా వేసుకుని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి జనసేన అభ్యర్థిగా టికెటు ఇస్తే తామెలా సహకరించగలమని ప్రశ్నించారు.

రాజీనామాలకు సిద్ధం: జనసేన పార్టీ నేతలు

సాలూరు, అక్టోబరు 17(ఆంధ్ర‌జ్యోతి): సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైసీపీకి చెందిన గొర్లె విజయకుమారికి జనసేన టికెట్‌ ఇవ్వడంపై జనసైనికులు భగ్గుమన్నారు. అధిష్ఠానం తీరుకు తప్పుబట్టారు. శనివారం పట్టణంలోని ఓ కల్యాణమండపంలో స్థానిక విలేఖర్లతో వారు మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వ్యక్తికి జనసేన తరఫున సీటు ప్రకటించడం చాలా దారుణమన్నారు. ‘శుక్రవారం సాలూరు వచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు స్థానిక నాయకులు, ఆశావాహులతో రోజంతా చర్చలు జరిపారు. సాలూరు మున్సిపాలిటీలో 32 కౌన్సిలర్‌ స్థానాలకు నామినేషన్లు వేయాలని చెప్పారు. ఇప్పుడేమో జనసేన నాయకులు, కార్యకర్తలతో మాట్లా డకుండా.. వైసీపీకి చెందిన గొర్లె విజయకుమారికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జనసేన అభ్యర్థిగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం. టీడీపీకి చెందిన వారికి టికెటు కేటాయిస్తే ... కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధిష్ఠానం తీరుమార్చుకోకపోతే పట్టణంలోని జనసేన నాయకులంతా మూకమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని వారు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు శివకృష్ణ, జరజాపు సూరిబాబు, ఈశ్వరరావు, గొర్లె తిరుపతినాయుడు , అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:21 AM