వైసీపీ నుంచి టీడీపీలోకి..
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:59 PM
టిక్కబాయి, జాపాయి గ్రామాలకు చెందిన 50 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి.
గుమ్మలక్ష్మీపురం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): టిక్కబాయి, జాపాయి గ్రామాలకు చెందిన 50 వైసీపీ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. ప్రభుత్వ విప్ జగదీశ్వరి సమక్షంలో వారు టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆమె ఆహ్వానించారు. అనంతరం జగదీశ్వరి మాట్లాడుతూ టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ పాలనపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి సముచిత గౌరవం, ప్రాధాన్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అడ్డాకుల నరేష్, బిడ్డిక పద్మావతి, కడ్రక కళావతి, పత్తిక ముసురు, సాంబమూర్తి, కొండలరావు, గుంజన్న, కామేశ్, ధర్మారావు, సుధీర్, శ్రీదేవి పాల్గొన్నారు.