వైసీపీ నుంచి టీడీపీలోకి..
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:17 AM
రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
బొబ్బిలి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. స్థానిక కోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీనాయన... కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొట్టక్కి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, పీఏసీఎస్ చైర్మన్ ముల్లు రాంబాబు, వంగపండు అప్పలనాయుడు, పిల్లా శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీకి చెందిన సోంబార్కి మోహన్, ఇనపచొప్పల సింహాచలం, రాము, సూర్యనారాయణతో కలిసి ఆయా కుటుంబాలు టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బేబీనాయన చేస్తున్న కృషికి ఆకర్షితులయ్యామన్నారు. పేదల సంక్షేమానికి ఆయన చేస్తున్న సేవలకు గానూ తామంతా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నామన్నారు. గ్రామానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికి ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.