Share News

From Mock Assembly నాడు మాక్‌ అసెంబ్లీలో.. నేడు ‘పది’ ఫలితాల్లో సత్తా

ABN , Publish Date - May 03 , 2026 | 12:17 AM

“From Mock Assembly Then to Excelling in Class 10 Results Today రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని అమరావతిలో గతేడాది నవంబరు 26న నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో ప్రతిభ చూపిన జిల్లా విద్యార్థులు.. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ సత్తా చాటారు.

 From Mock Assembly    నాడు మాక్‌ అసెంబ్లీలో..  నేడు ‘పది’ ఫలితాల్లో సత్తా
మంత్రులు లోకేష్‌, సంధ్యారాణితో సాయి సౌమ్య (ఫైల్‌)

పార్వతీపురం, మే2(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని అమరావతిలో గతేడాది నవంబరు 26న నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో ప్రతిభ చూపిన జిల్లా విద్యార్థులు.. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ సత్తా చాటారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీకి.. జిల్లా నుంచి పలువురు విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో మక్కువ జడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని సాయిసౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించింది. టెన్త్‌ ఫలితాల్లో ఈ బాలిక 571 మార్కులు సాధించింది. పాలకొండ మండలం ఎం.సింగుపురం జడ్పీ హైస్కూలుకు చెందిన పదో తరగతి విద్యార్థిని గంధారపు నిహారిక ఎమ్మెల్యేగా వ్యవహ రించగా.. టెన్త్‌లో 586 మార్కులు కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే హోదాలో మాక్‌ అసెంబ్లీకి వెళ్లిన గరుగుబిల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పదో తరగతి విద్యార్థి డి.దినేష్‌కుమార్‌కు 578 మార్కులు వచ్చాయి. కాగా నాడు మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.. పదోతరగతి ఫలితాల్లోనూ ప్రతిభ చూపడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:17 AM