Roads అధ్వాన దారి.. అద్దంలా మారి..
ABN , Publish Date - May 26 , 2026 | 11:37 PM
From Bad Roads to Mirror-Smooth Streets.. రేగుమానుగూడ గిరిశిఖర గ్రామస్థుల ఇరవై ఏళ్ల కల నెరవేరింది. కూటమి చొరవతో ఆ గ్రామ రహదారి నిర్మాణం పూర్తయింది. ఒకప్పుడు రాళ్లు తేలి అధ్వానంగా ఉన్న రహదారి నేడు అద్దంలా మారడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గిరిజనుల హర్షం
సీతంపేట రూరల్, మే26(ఆంధ్రజ్యోతి): రేగుమానుగూడ గిరిశిఖర గ్రామస్థుల ఇరవై ఏళ్ల కల నెరవేరింది. కూటమి చొరవతో ఆ గ్రామ రహదారి నిర్మాణం పూర్తయింది. ఒకప్పుడు రాళ్లు తేలి అధ్వానంగా ఉన్న రహదారి నేడు అద్దంలా మారడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గుంజయిగూడ- రేగుమాను గూడ వరకు 0.700మీటర్లకు గాను రెండు రీచ్‌లకు కలిపి కూటమి ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరుచేసింది. ఈ ఉపాధి నిధులతో గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ పర్యవేక్షణలో శరవేగంగా సీసీ రహదారి పనులు పూర్తయ్యాయి. మొత్తంగా రోడ్డు కష్టాలు తీరడంతో రెండు గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.