Share News

ఆసుపత్రులకు ఫ్రీజర్‌ బాక్సులు

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:07 AM

జిల్లాలోని ఏడు ప్రభుత్వ ఆసుపత్రులకు ఫ్రీజర్‌ బాక్సులను ప్రభుత్వం మంజూరు చేసిందని డీసీహెచ్‌ డా.నాగభూషణరావు తెలిపారు.

 ఆసుపత్రులకు ఫ్రీజర్‌ బాక్సులు
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్‌ బాక్స్‌

బెలగాం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏడు ప్రభుత్వ ఆసుపత్రులకు ఫ్రీజర్‌ బాక్సులను ప్రభుత్వం మంజూరు చేసిందని డీసీహెచ్‌ డా.నాగభూషణరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఫ్రీజర్‌ బాక్సులు లేక పోవడంతో మృతదేహాలను భద్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బాడీ సదుపాయంతో కూడిన ఆధునిక ఫ్రీజర్‌ బాక్సులను జిల్లాకు కేటాయించిందన్నారు. పార్వతీపురం, సాలూరు, సీతంపేట, కురుపాం, పాలకొండ, భద్రగిరి, చినమేరంగి, ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక డబుల్‌ బాడీ ఫ్రీజర్‌ బాక్సులను మంజూరు చేసిందని ఆయన వివరించారు.

Updated Date - Jun 05 , 2026 | 12:07 AM