నేటి నుంచి దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:25 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దివ్యాంగశక్తి పథకాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిణి జి.వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రింగురోడ్డు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దివ్యాంగశక్తి పథకాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిణి జి.వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతానికి పైగా అంగ వైకల్యం ఉన్నవారికి బస్సుల్లో ఉచితంగా ప్ర యాణం చేయవచ్చన్నారు. పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ సౌకర్యం ఉంటుందని చెప్పారు. దివ్యాంగు లకు తోడుగా వచ్చే ఎస్కార్ట్‌లకు ఎప్పటిలాగే 50శాతం రాయితీ ఉంటుందని తెలిపారు.
శృంగవరపుకోట, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని ఎస్.కోట ఆర్టీసీ డిపో మేనే జర్ కె.సుదర్శనరావు మంగళవారం ఓ ప్రకట నలో తెలిపారు. 40 శాతం, ఆపైన దివ్యాంగత కలిగిన వారికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు బుధవారం నుంచి బస్ పాస్‌లను మంజూరు చేస్తామన్నారు.