Share News

మహిళా పోలీసులకు ఉచిత వైద్య శిబిరం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:25 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖలో మహి ళల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.

మహిళా పోలీసులకు ఉచిత వైద్య శిబిరం

బెలగాం, మార్చి 3 ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖలో మహి ళల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బెలగాంలోని జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స్‌లో హాల్లో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. మహిళా పోలీసులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిం చారు. అవసరమైన మందులు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు వృత్తి బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు ఉంటాయన్నారు. వారి ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం ముఖ్యమన్నారు. అనంతరం వైద్యులు మహిళా పోలీసులకు సర్వికల్‌ బ్రెస్ట్‌ క్యాన్స ర్‌పై అవగాహన కల్పించారు. ఏఎస్‌పీ వెంకటేశ్వ రరావు, పార్వతీపురం ఏఆర్‌ డీఎస్‌పీ ధామస్‌రెడ్డి, సీఐ వెంకటరావు, వైద్యులు రజనిప్రియ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:25 AM