కార్మికులకు ఉచితంగా న్యాయం
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:10 AM
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు, బలహీనులకు ఉచిత న్యాయం అందించేందుకు న్యాయసేవాసంస్థలు పనిచేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు పేర్కొన్నారు.
రేగిడి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు, బలహీనులకు ఉచిత న్యాయం అందించేందుకు న్యాయసేవాసంస్థలు పనిచేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని సంకిలిలో 2015 నల్సా, జాగృతి పఽథకాలపై కార్మికులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రాజాం ప్రభుత్వ న్యాయవాది పి.శ్రీనివాస్, రాజాం బార్‌అ సోసియేషన్ న్యాయవాదులు ఆర్.విజయ్ కుమార్, సీహెచ్ శంకరరావు, రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర ప్రవీణ్‌కుమార్ ఈశ్వరరావు పాల్గొన్నారు.