Free Legal ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:33 AM
Free Legal Aid for the Public పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించారు. అర్జీదారులు నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీనియర్ అడ్వకేట్, పారా లీగల్ వలంటీర్లను ఆదేశించారు.
పార్వతీపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించారు. అర్జీదారులు నుంచి స్వయంగా వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీనియర్ అడ్వకేట్, పారా లీగల్ వలంటీర్లను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిట్ క్లినిక్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి సోమవారం పారా లీగల్ వలంటీర్లు, న్యాయసేవా సహాయకులు.. లీగల్ ఎయిడ్ క్లినిక్ వద్ద అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తారు. దరఖాస్తులు రాయడంతో పాటు సమస్య పరిష్కారమయ్యే వరకు అవసరమైన న్యాయ సహాయ సహకారాలు అందిస్తారు. దీనిపై ఎటువంటి సందేహాలు ఉన్నా స్థానికంగా ఉండే జిల్లా న్యాసేవాధికార సంస్థ కార్యదర్శి లేదా పారా లీగల్ వలంటీర్లను సంప్రదించొచ్చు. న్యాయమూర్తులను జడ్జిలా కాకుండా ఒక అధికారిగా భావించి సమస్యలు తెలియజేయాలి. పార్వతీపురంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటుకు చొరవ చూపిన కలెక్టర్ అభినందనీయులు.’ అని తెలిపారు.
ఆ తర్వాత కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల్లో 9 శాతం భూ సంబంఽధిత కేసులు, సివిల్, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉంటున్నాయి. దీంతో వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఉద్దేశంతో రెవెన్యూ క్లినిక్‌కు అనుబంధంగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారంతో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించాం. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తాం. భూ రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్, డాక్యుమెంట్లును పరిశీలించి తగిన న్యాయ సహాయం అందిస్తాం.’ అని తెలిపారు. ఈ కార్య క్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత, జిల్లా రెండో అదనపు న్యాయాధికారి దామోదరరావు, బీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణ ప్రసాద్, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్లు వైశాలి, స్వప్నిల్ జగన్నాథ్, ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.