Share News

గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సహాయం

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:10 AM

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, న్యాయపరమైన సమస్యలపై అవగాహ న కల్పించడమే లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయాధికా రి ఎం.బబిత అన్నారు.

గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సహాయం

  • జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత

ఎస్‌.కోట రూరల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, న్యాయపరమైన సమస్యలపై అవగాహ న కల్పించడమే లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయాధికా రి ఎం.బబిత అన్నారు. ఎస్‌.కోట మండలం మూలబొ డ్డవర గ్రామంలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలు, నల్సా పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశ మన్నారు. ఈ కేంద్రానికి ఒక ప్యానెల్‌ న్యాయవాదిని, పారా లీగల్‌ వలంటీర్‌ను నియమిం చామని చెప్పారు. వీరు ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పిస్తూ... అవసరమైన వారికి న్యాయ సహాయం అందించడంలో సహకరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కనకలక్ష్మి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:10 AM