Share News

HPV Vaccine బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:06 PM

Free HPV Vaccine for Girls జిల్లాలో 14-15 ఏళ్లు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గర్భాశయ ముఖద్వార (సెర్వికల్‌) క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.

 HPV Vaccine బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌

బెలగాం, మార్చి9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 14-15 ఏళ్లు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గర్భాశయ ముఖద్వార (సెర్వికల్‌) క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. సోమవారం జిల్లాకేంద్రాసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పకడ్బందీగా వ్యాక్సినేషన్‌ చేపట్టాలన్నారు. 14 ఏళ్లు నిండిన పది వేల మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. వ్యాక్సిన్‌ ధర రూ.4 వేలు అయినా.. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం దీనిని ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణ రావు, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:06 PM