Share News

Surya Ghar సూర్య ఘర్‌తో విద్యుత్‌ ఉచితం.. రాయితీ అదనం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:00 AM

Free Electricity with Surya Ghar, Plus Subsidy ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ యోజనతో లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్‌ పొందొచ్చని, అదనంగా రాయితీ కూడా వర్తిస్తుందని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి తెలిపారు. మంగళవారం ఏపీఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలో పట్టణంలో’సేవ సేతు’ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

 Surya Ghar  సూర్య ఘర్‌తో  విద్యుత్‌ ఉచితం.. రాయితీ అదనం
జెండా ఊపి సేవ సేతు ర్యాలీని ప్రారంభిస్తున్న ఇన్‌చార్జి జేసీ

పార్వతీపురం టౌన్‌/బెలగాం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ యోజనతో లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్‌ పొందొచ్చని, అదనంగా రాయితీ కూడా వర్తిస్తుందని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి తెలిపారు. మంగళవారం ఏపీఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలో పట్టణంలో’సేవ సేతు’ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పర్యావరణహిత ఆలోచనలను వ్యవస్థీకృతం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సూర్య ఘర్‌ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సోలార్‌ రూప్‌ టాప్‌ అమర్చుకోవడం వల్ల వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు అనంతరం ఏపీఈపీడీసీఎల్‌ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్‌ ఎస్‌.త్రినాఽథరావు మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్‌ యోజన పథకాన్ని జిల్లాలో పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 14,110 మందిని అర్హులుగా ఎంపిక చేయగా 9వేల వరకు సోలార్‌ పరికరాలు అమర్చామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి శతశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఎస్టీ, ఎస్సీలకైతే రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈలు ఆర్‌.రామునాయుడు, డి.పురుషోత్తమ్‌, డీఈఈ వి.రంగారావు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:00 AM