Share News

56 లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:49 AM

వికాస్‌ తరంగణి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 56 లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు.

56 లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు

  • త్రిదండి చినజీయర్‌ స్వామి

గజపతినగరం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వికాస్‌ తరంగణి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 56 లక్షల మందికి ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. ఆదివారం స్థానిక సీతారామస్వామి దేవాలయం ప్రాంగణంలోగల వేంకటేశ్వర ఆలయానికి స్థానిక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవి 20 రకాల వెండి ఆభరణాలను చినజీయర్‌ స్వామికి అందజేయగా.. ఆయన చేతులమీదుగా స్వామి వారికి అలంకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో అధికంగా గర్భసంచి, రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయన్నారు. వికాస్‌ తరంగణి ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ అందజేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బయట మార్కెట్‌లో ఒక్కో పరీక్షకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు జరిగినప్పటికీ వికాస్‌ తరంగణి ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంతవరకు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారని తెలిపారు. ఉత్సాహవంతులైన మహిళలు ముందుకు వచ్చి శిక్షణ తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్లను మంచి పనులకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ముందు సినీ నటుడు సుమన్‌ ఈ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దంపతులతో పాటు ఆలయ ఈవో శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2026 | 12:49 AM