ప్రైజ్‌మనీ పేరిట మోసం
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:35 PM
పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీచేస్తు న్నా కొందరు అత్యాశకు పోయి సైబర్ మోసా లకు గురవుతున్నారు.
సైబర్ వలలో మరువాడ వాసి
రూ.18 లక్షలు పోగొట్టుకున్న వైనం
రాజాం రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యో తి): పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీచేస్తు న్నా కొందరు అత్యాశకు పోయి సైబర్ మోసా లకు గురవుతున్నారు. తాజాగా, వంగర మం డలం మరువాడ గ్రామానికి చెందిన గాడి సతీష్ సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కి రూ.18 లక్షలు పోగొట్టుకున్నాడు. రాజాం టౌన్ సీఐ నవీన్‌కుమార్ వివరాల మేరకు.. సతీష్ రాజాం లోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ సమీపంలో నివశిస్తున్నాడు. మూడు నెలల కిందట పోస్టులో మీషో పేరిట ఆయనకు ప్రైజ్ మనీ కార్డు వచ్చింది. దాన్ని స్ర్కాచ్ చేసి చూస్తే.. రూ.24 లక్షల బహుమతి వచ్చినట్లు ఉంది. అది చూసి ఎగిరి గంతేశాడు. అందులో ఉన్న వాట్సాప్ నెంబర్ (82820 22714)కు తన వివరాలు పంపాడు. దీంతో సైబర్ కేటు గాడు రంగంలోకి దిగాడు. ఆధార్, పాన్, బ్యాం కు వివరాలు పంపాలని సతీష్‌కు సూచించా డు. క్షణాల్లో వాటిని సతీష్ పోస్ట్ చేశాడు. ఇదే సమయంలో యూనియన్ బ్యాంకు ఖాతాకు రూ.9,600 పంపించాలని చెప్పడంతో ఆ మొ త్తాన్ని చెల్లించాడు. వెంటనే మరో రూ.16,500 ఇండియన్ బ్యాంక్ (83015 76712) నెంబర్‌కు సైతం పంపించాడు. అక్కడితో ఆగని సైబర్ నేరగాడు జీఎస్టీ, సీజీఎస్టీ, ఇతర చార్జీల కోసం కొంత చెల్లిస్తే ప్రైజ్‌మనీ రూ.24 లక్షలు వస్తాయని ఆశ చూపాడు. అదే విధంగా సతీష్ నగదు పంపాడు. ఇలా రూ.18 లక్షలు చెల్లించాక తాను మోసపోయినట్లు గుర్తించి బుధవారం రాత్రి రాజాం పోలీసులను ఆశ్రయిం చాడు. సీఐ నవీన్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు తమ సొంత సమాచారాన్ని పంపించవద్దని, ఫోన్లలో వచ్చిన లింక్స్ ఓపెన్ చేయవద్దని, అపరిచితుల మాటలు నమ్మవద్దని సీఐ సూచించారు.