ఇళ్ల స్థలాల పేరుతో మోసం
ABN , Publish Date - May 28 , 2026 | 12:50 AM
రాజాంలో రియల్ ఎస్టేట్ పేరుతో మోసం వెలుగుచూసింది.
రాజాంలో బాధితుల ఆందోళన
రాజాం, మే 27 (ఆంధ్రజ్యోతి): రాజాంలో రియల్ ఎస్టేట్ పేరుతో మోసం వెలుగుచూసింది. దీంతో బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. పట్టణంలో సాయిచైతన్య రియల్ ఎస్టేట్ పేరుతో సీర నారాయ ణరావు అనే వ్యక్తి ఓ సంస్థ నిర్వహి స్తుండేవాడు. ఆయన దగ్గర వంగర మండలం కొండచాకరపల్లి గ్రామాని చెందిన ఓ 30 మంది ఈఎంఐ పద్ధతి లో ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించారు. ఒక్కొక్కరు ఇలా రూ.1.50 లక్షల వర కూ చెల్లించారు. వీరంతా బతుకు తెరువు కోసం విశాఖ పట్నంలోని ఆరిలోవలో ఉంటున్నారు. కాయకష్టం చేసి కుటుంబ సమేతంగా సంపాదించిన డబ్బులు రియాల్ ఎస్టేట్ యజమానికి చెల్లించామని బెవర గౌరినాయుడు, రాము, శంకరరావు, శ్రీరాములునాయుడు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు సరికదా.. కట్టిన డబ్బులకు స్థలాలు కూడా ఇవ్వడానికి నిరాక రిస్తున్నాడన్నారు. స్థలాలు అప్పగిస్తామని చెప్పి తమను నిండా ముంచేశాడని, ఈ విషయంపై స్థానిక పోలీసులుకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రాజాం పట్టణంలోని బుచ్చియ్యపేట రోడ్డులో వెంచర్ చూపించారు. స్థలాలు కూడా కేటాయించినట్టు తెలిపారు. తీరా ఈఎంఐ చెల్లింపులు పూర్తికావడంతో ప్లాట్ల కోసం వారు రాజాంలోని తిరుమల కాంప్లెక్స్ వద్ద ఉన్న సంస్థ కార్యాలయానికి వచ్చారు. కానీ నారాయణ రావు అందుబాటులో లేరు. అయితే ఆ ప్లాట్లు వేరే వారి పేర్లతో రిజిస్ర్టేషన్ అయ్యాయని బాధితులు తెలుసుకు న్నారు. బుధవారం వెంచర్ల వద్ద ఆందోళనకు దిగారు. రూ.45 లక్షల వరకూ పొగొట్టుకున్నామని.. తమకు న్యా యం చేయాలని కోరుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది.