మహిళపై మోసం కేసు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:30 AM
తాను చెప్పిన బ్యాంకులో పెట్టుబడి పెడి తే బంగారం, డబ్బు రెట్టింపు అవుతాయని నమ్మించి ఓ మహిళను మోసం చేసిన మరో మహిళపై కేసు నమోదు చేసినట్టు సీఐ టీవీ విజయ్‌కుమార్ తెలిపారు.
కొత్తవలస, జూలై 18(ఆంధ్రజ్యోతి): తాను చెప్పిన బ్యాంకులో పెట్టుబడి పెడి తే బంగారం, డబ్బు రెట్టింపు అవుతాయని నమ్మించి ఓ మహిళను మోసం చేసిన మరో మహిళపై కేసు నమోదు చేసినట్టు సీఐ టీవీ విజయ్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళపాలెం గ్రామానికి చెందిన సరిసా భారతికి అదే గ్రామానికి చెందిన బట్టల షాపులో పనిచేస్తున్న సిమ్మ లక్ష్మితో పరిచయం ఏర్పడింది. సిమ్మ లక్ష్మి తనకు ఒక ప్రైవేటు బ్యాంకులో సభ్యత్వం ఉందని, ఆ బ్యాంకులో ఒక తులం బంగారం పెట్టుబడి పెడితే.. రెండు, మూడు నెలలోనే రెండు తులాల బంగారం వస్తుందని నమ్మించింది. లక్ష్మి మాటలను నమ్మిన భారతి 2020 సంవత్సరం నుంచి 15 తులాల బంగారాన్ని, రూ.8లక్షలను దఫదఫాలుగా లక్ష్మికి ఇచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన బంగారం, డబ్బులు కూడా వెనక్కి రాలేదు. దీంతో భారతి తాను మోసపోయాయని గ్రహించింది. ఇదే సమయంలో లక్ష్మి తన ఇంటిని కూడా ఖాళీ చేసి, ఊరి నుంచి వెళ్లిపోయింది. దీం తో శనివారం రాత్రి సిమ్మ లక్ష్మిపై భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.