Share News

Fox Crosses the Path… నక్క అడ్డొచ్చి.. గాయాలపాలై!

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:04 AM

Fox Crosses the Path… Leaves Person Injured! సాలూరు మండలం బొడ్డవలస సమీపంలో రోడ్డు దాటుతున్న నక్కను ఢీ కొని ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతుండగా.. ఈ ఘటనలో నక్క మాత్రం మృతి చెందింది.

 Fox Crosses the Path… నక్క అడ్డొచ్చి.. గాయాలపాలై!

సాలూరు రూరల్‌, మార్చి11(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం బొడ్డవలస సమీపంలో రోడ్డు దాటుతున్న నక్కను ఢీ కొని ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతుండగా.. ఈ ఘటనలో నక్క మాత్రం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి చెందిన కొర్ర జగన్నాథ్‌ చేపల వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఎప్పటిలానే బుధవారం వెంగళరాయసాగర్‌కు వెళ్లి చేపలను కొనుగోలు చేసి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. సాలూరు మండలం బొడ్డవలస సమీపానికి వచ్చేసరికి రోడ్డు దాటుతున్న నక్కను ఢీ కొన్నాడు. ఈ ఘటనలో బైక్‌ బోల్తా పడడంతో జగ న్నాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నక్క మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రుడిని సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:04 AM