Share News

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:30 AM

మండలంలోని మోదవలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

డెంకాడ, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని మోదవలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయ నగరం నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ఓ కారును వెనుక నుంచి వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు రోడ్డుపై పనిచేస్తున్న మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్ర మాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:30 AM