Share News

రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

ABN , Publish Date - May 10 , 2026 | 12:28 AM

కొత్తవలస పంచాయతీ రాజన్న కాలనీ వద్ద డంపింగ్‌యార్డు నిర్వహించ డం చట్ట విరుద్ధమని ఆ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

 రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

కొత్తవలస, మే 9(ఆంధ్రజ్యోతి): కొత్తవలస పంచాయతీ రాజన్న కాలనీ వద్ద డంపింగ్‌యార్డు నిర్వహించ డం చట్ట విరుద్ధమని ఆ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకుడు ఒబ్బిన సన్యాశినాయుడు ఆధ్వర్యంలో వారు శనివారం డంపింగ్‌ యార్డు వద్ద సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇక్కడ డంపింగ్‌యార్డు నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని కాలుష్య నియంత్రణాధికారులు తెలిపారన్నారు. అలాగే నివాస ప్రాంతాలకు 500 మీటర్ల దూరంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసుకోవలసి ఉండగా.. ఇక్కడ డంపింగ్‌యార్డు కాలనీకి 125 మీటర్ల దూరంలో మాత్రమే ఉందని తెలిపారు. డంపింగ్‌యార్డును తుర్లవాడలోని ఎరువుల కేంద్రానికి తరలించాలని, వ్యర్థాలను పారవేయడానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని పంచాయతీ కార్యదర్శికి కాలుష్య నియంత్రణాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రెవెన్యూ శాఖ కొత్తవలస సర్వే నెం.173లో డంపింగ్‌యార్డు కోసం స్థలం కేటాయించినా అనువుగా లేదని, అక్కడ చెత్త వేయడానికి పంచాయతీ సిబ్బంది నిరాకరిస్తున్నారని వారు తెలిపారు. ఇక్కడ నుంచి డంపింగ్‌యార్డును తరలించే వరకు తమ పోరాటం చేస్తామని ప్రకటించారు.

Updated Date - May 10 , 2026 | 12:28 AM