Share News

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:37 AM

మండల పరిధిలోని పొగిరి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

రాజాం రూరల్‌, మార్చి 27(ఆంరఽధజ్యోతి): మండల పరిధిలోని పొగిరి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పాలఖండ్యాం నుంచి రాజాం వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఇదేమార్గంలో వస్తున్న వ్యాను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శశిభూషణ్‌, మంగ తదితరులు గాయపడ్డారు. వీరంతా రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజాం పొలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:37 AM